అమరావతి: గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కాకినాడ కేంద్రంగా జర్మనీ, సింగపూర్, జపాన్‌కు గ్రీన్ ఎనర్జీ సరఫరా చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మొత్తం 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సుమారు 8 వేల మందికి ఉద్యోగాలు కలగనున్నాయని వెల్లడించారు. ఈ అంశంపై శుక్రవారం సాయంత్రం 6 గంటలకు కీలక ప్రకటన ఉంటుందని, అప్పటి వరకూ వేచి ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa