ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు తిండిలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్‌లు చుట్టూ తిరుగుతున్నారు. ఇక, బరువు తగ్గడంలో వెయిట్ చూసుకోవడం చాలా ముఖ్యం. దాదాపు బరువు తగ్గాలనుకునే ప్రతి ఒక్కరి దగ్గర వెయింగ్ మెషీన్ ఉంటుంది. అయితే, కొన్నిసార్లు మీ బరువు ఒకే రోజులో 2 నుంచి 3 కిలోల వరకు హెచ్చుతగ్గులు చూపిస్తుంది.
దీంతో చాలా మంది నిరుత్సాహపడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో క్లారిటీ ఉండదు. దీనిపై క్లారిటీ ఇచ్చారు ఫిట్నెస్ ట్రైనర్, NASM సర్టిఫైడ్ నిపుణులు అలెక్స్. అతని ప్రకారం తప్పు సమయంలో బరువు చూసుకోవడం మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది. అనవసరమైన ఒత్తిడిని పెంచుతుంది. కొన్నిసార్లు మన శరీరం తాత్కాలిక మార్పులకు లోనవుతున్నప్పుడు మనం బరువు చూసుకుంటాం. ఈ సమయంలో బరువు చూసుకున్నా ప్రయోజనం ఉండదు. ఇది తప్పుడు రీడింగ్ల్ని చూపిస్తుంది. అలెక్స్ ప్రకారం బరువు ఎప్పుడు చూసుకోకూడదు, ఎప్పుడు చూసుకోవాలో తెలుసుకుందాం.
తిన్న వెంటనే లేదా ఏదైనా తాగిన తర్వాత
చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఏదైనా తిన్న వెంటనే లేదా నీరు తాగిన తర్వాత బరువు చూసుకుంటారు. అయితే, బరువు చూసుకోవడానికి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఆహారం, ద్రవాలు తాత్కాలిక బరువు పెరగడానికి కారణమవుతాయి.
ఈ బరువు కొవ్వు వల్ల వచ్చింది కాదు.. కడుపులోని పదార్థాల వల్ల వచ్చిందని మీరు గమనించాలి. అందుకే తిన్న వెంటనే బరువు చూసుకోవద్దు. అంతేకాకుండా తాగిన తర్వాత కూడా వెయిట్ చేసుకోవద్దు.
పీరియడ్స్ సమయంలో కూడా వద్దు
పీరియడ్స్ సమయంలో కూడా బరువు చూసుకోకూడదని అలెక్స్ అంటున్నారు. పీరియడ్స్ సమయంలో హార్మోన్లు అసమతుల్యతకు కారణమవుతాయి. హార్మోన్ల మార్పులు శరీరంలో నీటిని నిలుపుకోవడానికి కారణమవుతాయి. దీని వల్ల 2 నుంచి 5 పౌండ్ల బరువు పెరుగుతుంది. అంటే కేజీ నుంచి 2 కిలోలు వరకు తేడా కనిపిస్తుందని ఎక్స్పర్ట్ మీ పీరియడ్స్ ముగిసిన తర్వాత ఈ బరువు సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుంది.
మద్యం తాగినప్పుడు కూడా వద్దు
మందు తాగిన తర్వాత కూడా బరువు చెక్ చేసుకోకూదని అలెక్స్ అంటున్నారు. మద్యం తాగడం వల్ల శరీర హైడ్రేషన్‌కి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కొన్నిసార్లు శరీరంలో నీరు నిలుపుదల జరుగుతుంది. ఇలాంటప్పుడు బరువు ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు డీహ్రైడేషన్ పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు బరువు తగ్గినట్టు కనిపించవచ్చు. అందుకే మద్యం తాగిన తర్వాత బరువు చెక్ చేసుకోవద్దని అలెక్స్ సూచిస్తున్నారు.
ఈ సమయాల్లో కూడా బరువు చెక్ చేసుకోకండి
వ్యాయామం తర్వాత వెంటనే బరువు చెక్ చేసుకోకూడదు. దీని వల్ల బరువు తగ్గినట్టు అనిపించవచ్చు. ఎందుకంటే వ్యాయామం చేసిన తర్వాత ఎక్కువగా చెమట పడుతుంది. చెమట పట్టడం వల్ల బరువు తగ్గినట్లు అనిపించవచ్చు. అంటే దీని అర్థం కొవ్వు తగ్గడం కాదు. నీటి నష్టం అని గమనించండి.
రోజులోని వేర్వేరు సమయాల్లో బరువు చెక్ చేసుకోవద్దని అలెక్స్ సూచిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వేర్వేరు సమయాల్లో బరువు చెక్ చేసుకోవడం వల్ల కేజీ నుంచి రెండున్నర కిలోల వరకు మార్పు కనిపించవచ్చు. ఇది గందరగోళాన్ని పెంచుతుంది.
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్న తర్వాత వెయిట్ చెక్ చేసుకోవద్దని అలెక్స్ అంటున్నారు. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. మీ రీడింగ్ సరిగ్గా చూపించదు.
అధిక కార్బ్ ఆహారం తిన్న తర్వా వెయిట్ చేసుకోవద్దు. కార్బోహైడ్రేట్లు శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తాయి. దీని వల్ల 3 నుంచి 6 పౌండ్ల బరువు ఎక్కువగా కనిపిస్తుంది.
బరువు ఎప్పుడు చూసుకోవాలి?
ఫిట్నెస్ ట్రైనర్ అలెక్స్ ప్రకారం స్థిరమైన పద్ధతి ఒకటి ఉంది. ఉదయం బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత.. ఏం తినకుండా, తాగకుండా బరువు చూసుకోవాలని అలెక్స్ సూచిస్తున్నారు.
బరువు చూసుకునేటప్పుడు షూస్ ధరించడం, వెయిట్ ఎక్కువ ఉన్న దుస్తులు ధరించడం మానుకోండి.
చివరగా.. ఆరోగ్యకరమైన బరువు మాత్రమే మంచి ఆరోగ్యానికి కొలమానం కాదని గుర్తించుకోవాలి. కండరాల బలం, కొవ్వు శాతం, శరీర ఆకృతి, శక్తి స్థాయిలు కూడా మంచి ఆరోగ్యానికి కీలకం.
చాలా మంది కొన్నిసార్లు స్థిరమైన బరువును నిర్వహిస్తారు. అయినప్పటికీ వారి శరీరాలు బలంగా, అంతర్గతంగా ఫిట్‌గా ఉంటాయి. అందువల్ల, బరువును క్రమం తప్పకుండా కొలవడం ముఖ్యం అయినప్పటికీ, అది ఆరోగ్యానికి ఏకైక కొలమానం కాదు. బరువు కంటే ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa