భూముల సమగ్ర రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'క్రెడిట్ చోరీ'కి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన 'భూ రక్ష', 'భూ హక్కు' పథకాలను చంద్రబాబు హైజాక్ చేశారని, ఈ బృహత్కార్యంలో ఆయన పాత్ర ఏమాత్రం లేకపోయినా ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తన పాదయాత్ర సందర్భంగా రైతులు భూ వివాదాలు, టైటిల్స్ సమస్యలపై తన వద్ద గోడు వెళ్లబోసుకున్నారని, అందుకే 2019 మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చామని గుర్తుచేశారు. తమ హయాంలో రూ.6,000 కోట్లు ఖర్చు చేసి, దాదాపు 40,000 మంది సిబ్బందిని నియమించి అత్యాధునిక టెక్నాలజీతో సమగ్ర భూ సంస్కరణలు చేపట్టామని, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయని తెలిపారు.కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక, రైతులకు గతంలో ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలను వెనక్కి తీసుకుని, వాటి రంగు మార్చి మళ్లీ ఇస్తూ మొత్తం ఘనత తనదేనని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ కొత్త పాస్‌బుక్‌లలో తప్పులు ఎక్కువగా ఉండటంతో రైతుల కష్టాలు మరింత పెరిగాయన్నారు. అంతేకాకుండా, ఈ పథకం అమలును ప్రశంసిస్తూ కేంద్రం ఇచ్చిన రూ.400 కోట్ల నిధులను కూడా టీడీపీ నాయకత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించడం సంచలనం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa