భారతీయ రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో 'ఏఎస్సీ అర్జున్' అనే హ్యూమనాయిడ్ రోబోను ప్రవేశపెట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ వినూత్న కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. రైల్వే కార్యకలాపాల్లో ఆధునిక టెక్నాలజీని వినియోగించడంలో ఇది ఒక మైలురాయిగా నిలవనుంది.ప్రయాణికుల భద్రత, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ రోబోను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 'ఏఎస్సీ అర్జున్' రోబో.. ప్రయాణికులకు సహాయం చేయడం, రద్దీని నియంత్రించడం, పరిశుభ్రతను పర్యవేక్షించడం, భద్రతాపరమైన అవగాహన కల్పించడం వంటి పనులను నిర్వర్తిస్తుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ రోబోను ప్రవేశపెట్టారు.ఈ రోబోను పూర్తిగా విశాఖపట్నంలోనే దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ధి చేయడం విశేషం. ఏడాదికి పైగా సమయం వెచ్చించి ఈ టెక్నాలజీని రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa