AP: విశాఖలోని భీమిలిలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. విశాఖకు చెందిన 24 ఏళ్ల యువకుడు, అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన 20 ఏళ్ల యువతి ఒకే కళాశాలలో చదువుతున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడగా, ఈ నెల 21న భీమిలి బీచ్, తగరపువలస ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ యువకుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa