ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రితో విస్తృతంగా చర్చించారు. కేంద్ర - రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి సంబంధిత అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa