ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పనిదినాలు తగ్గించాలంటూ ఈ నెల 27న సమ్మెకు దిగనున్న బ్యాంకు ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 25, 2026, 03:35 PM

వారానికి 5 రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని ప్రధాన బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. జనవరి 27న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్ బీయూ) ప్రకటించింది. ఈ సమ్మె కారణంగా ఆ రోజు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎన్డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం, జనవరి 26 అర్ధరాత్రి నుంచి 27 అర్ధరాత్రి వరకు ఈ సమ్మె జరగనుంది.తొమ్మిది బ్యాంకు సంఘాల ఉమ్మడి వేదిక అయిన యూఎఫ్ బీయూ, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్-1947 ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), చీఫ్ లేబర్ కమిషనర్, ఆర్థిక సేవల విభాగానికి (డీఎఫ్ఎస్) సమ్మె నోటీసు పంపింది. బ్యాంకులకు అన్ని శనివారాలు సెలవు దినాలుగా ప్రకటించి, 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని యూనియన్లు స్పష్టం చేశాయి.ఇప్పటికే ఈ ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఆమోదం తెలిపి ప్రభుత్వానికి సిఫార్సు చేసిందని యూనియన్లు గుర్తుచేశాయి. 2023 డిసెంబర్ 7న ఐబీఏ, యూఎఫ్ బీయూ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు ఈ సిఫార్సు జరిగింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa