వారం రోజుల క్రితం కిలో వెండి ధర రూ.4 లక్షల ఆల్ టైమ్ రికార్డ్ మార్క్ టచ్ అయ్యింది. కానీ, ఫిబ్రవరి 1, 2026న బులియన్ మార్కెట్లో వెండి ధర రూ.2 లక్షల 65 వేలకు దిగొచ్చింది. కేవలం 2 రోజుల్లోనే లక్షా 36 వేల రూపాయలు తగ్గింది. 2026-27 యూనియన్ బడ్జెట్, అంతర్జాతీయ పరిణామాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కొత్త ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ ఎంపిక కావడంతో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల బుక్కింగ్కి మొగ్గు చూపడం ఈ పతనానికి ప్రధాన కారణాలు. బడ్జెట్‌లో సుంకాల తగ్గింపు ఉంటుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురవ్వడంతో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. బంగారం ధర కూడా దాదాపు 20 శాతం మేర తగ్గింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa