అమెరికాతో పాటు పలు దేశాల రాజకీయాలను కుదిపేస్తున్న లైంగిక వేధింపుల వ్యవహారం ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తాను గడిపిన సమయం తప్పైపోయిందని, అందుకు అందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 2011లో ఎప్‌స్టీన్‌ను కలిశానని, మూడు ఏళ్లపాటు కొన్ని విందు కార్యక్రమాల్లో పాల్గొన్నామని, అయితే అతని దీవికి ఎప్పుడూ వెళ్లలేదని, అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. ఎప్‌స్టీన్ రాసిన డ్రాఫ్ట్ ఈ-మెయిల్స్‌లోని ఆరోపణలు అసత్యమని, తాను వాటిని ఎప్పుడూ పంపలేదని తోసిపుచ్చారు.అయితే.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన సంభాషణల తాలుకా మెయిల్స్, మరికొన్ని ఫొటోలు వెలుగులోకి రావడాన్ని బిల్‌గేట్స్ తోసిపుచ్చారు. ఎప్‌స్టీన్ రాసిన డ్రాఫ్ట్ ఈ-మెయిల్స్‌లో ఉన్న ఆరోపణలు అసత్యమని, ఆ ఈ-మెయిల్ ఎప్పుడూ తాను పంపలేదని తెలిపారు. మరోవైపు.. బిల్‌గేట్స్ వ్యక్తిగత ప్రతినిధి సైతం ఇదే విషయాన్ని ధృవీకరించారు. గేట్స్ తనతో స్నేహం కొనసాగించలేదన్న కోపంతోనే ఎప్‌స్టీన్ అలా డ్రాప్ట్ మెయిల్స్‌ను సృష్టించి ఉంటాడని తెలిపారు.
జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్‌స్టీన్.. టీచర్, ప్రముఖ ఆర్థికవేత్త. అమెరికాలో పలు రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు ఆర్థిక సలహాదారుడిగా పని చేశాడు. అలా.. క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులతో పరిచయం పెంచుకున్నాడు. అతనికి సంబంధించిన ప్రైవేట్ దీవుల్లో మైనర్లతో హైఫ్రొఫైల్ సెక్స్ రాకెట్ నిర్వహించాడనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎప్‌స్టీన్, అతనికి సహకరించిన వ్యక్తిగత సిబ్బంది గిస్లేన్ మ్యాక్స్‌వెల్‌ను అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయిన అదే ఏడాది(2019)లో ఎప్‌స్టీన్ జైల్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు(ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి). ఈ కేసులో ఎప్‌స్టీన్ ప్రైవేట్ ఐల్యాండ్ నుంచి సేకరించిన పలు వివరాలు.. సెక్స్‌రాకెట్‌లో పలువురు ప్రముఖులు ఉండడంతో ఎప్‌స్టీన్ ఫైల్స్‌గా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa