దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ అందించింది. తక్కువ ధరకే సురక్షిత ప్రయాణం అందించాలనే లక్ష్యంతో ‘భారత్ ట్యాక్సీ’ యాప్‌ను ఫిబ్రవరి 5న అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ యాప్‌ను లాంచ్ చేశారు. ర్యాపిడో, ఓలా, ఉబర్‌లకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ యాప్‌లో బైక్, ఆటో, కార్ సేవలు అందుబాటులో ఉంటాయి. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ వసూలు చేయకుండా జీరో కమిషన్ విధానం అమలు చేయనున్నారు. అలాగే హెల్త్, ప్రమాద బీమా వంటి ప్రయోజనాలు కల్పించనున్నారు.ప్రైవేట్ క్యాబ్ సంస్ధలు డ్రైవర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆ యాప్‌ల్లో రిజిస్ట్రర్ చేసుకుని సేవలు అందించే డ్రైవర్లను ఎక్కువ ఆదాయం లభించలేదు. అయితే భారత్ ట్యాక్సీ యాప్‌లో ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. దీంతో ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం డ్రైవర్‌కే వెళ్తుంది. దీని వల్ల డ్రైవర్లకు అధిక ఆదాయం లభించి వారికి బెనిఫిట్ జరగనుంది. అలాగే డ్రైవర్లకు హెల్త్ ఇన్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్యూరెన్స్, పదవీ విరమణ పొదుపులు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన డ్రైవర్లను సంత్కరించడం, వారికి ప్రోత్సహకాలు అందించడం లాంటివి చేస్తారు. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రైవేట్ సంస్ధలతో కేంద్రం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa