ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ గుండె బలంగా ఉండాలంటే రోజుకు ఎంత మొత్తంలో నూనె తీసుకోవాలో తెలుసా

Life style |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 11:12 PM

చాలా మంది వంటల్లో కచ్చితంగా వంట నూనె ఉపయోగిస్తుంటారు. కూరలు, ఫ్రై, స్నాక్స్, టిఫెన్లు, తాళింపు ఇలా అన్నింటికీ ఆయిల్ అవసరం. ఇక, చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ వండటానికి ఆయిల్ వాడుతుంటారు. వంట నూనె ఉపయోగించడం వల్ల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా కూరగాయ ముక్కలు లేదా మాంసం ముక్కలు బాగా వేగాలంటే నూనె తప్పనిసరి.


వంటల్లో నూనె వాడటంలో తప్పు లేదు. కానీ, దానికి ఓ లిమిట్ ఉంటుంది. వంటల్లో మోతాదుకు మించి ఆయిల్ వాడితే ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. కానీ పాన్‌లో నెమ్మదిగా మరిగే నూనె గుండెకు హాని చేస్తుందని మీకు తెలుసా? ఈ రోజుల్లో గుండె సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు.


అందుకే గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గుండె ఆరోగ్యం విషయానికొస్తే చాలా మంది వంట నూనె బ్రాండ్, నాణ్యత ఇలా ప్రతిదీ చర్చిస్తారు. ఇది మంచి విషయమే. అయితే, ఒక్క విషయంపై మాత్రం దృష్టి పెట్టరు. అయితే రోజూ వాడే వంట నూనె పరిమాణం. వంట నూనె ఎక్కువైతే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువై గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజులో ఎంత మొత్తంలో నూనె తీసుకోవాలో డాక్టర్ అజిత్ వి. కులకర్ణి చెప్పారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


  నిపుణులు ఏమంటున్నారు?


శరీర బరువు, వయసు, శారీరక శ్రమ, వైద్య పరిస్థితుల్ని బట్టి నూనె అవసరాలు మారుతూ ఉంటాయి. గుండె ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉండాలంటే నూనె వినియోగాన్ని పరిమితం చేయాలి. నూనె లేదా కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. నూనెను ఎంచుకునేటప్పుడు ఆరోగ్యకరమైన ఎంపికల్ని ఎంచుకోవడం కూడా ముఖ్యం.


ఆలివ్ నూనె, రైస్ బ్రౌన్ ఆయిల్, ఆవ నూనె వంటివి గుండె ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఎందుకంటే ఈ నూనెల్లో ఒమేగా-3, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నూనె రకాన్ని కూడా పరిగణించాలి. ఎందుకంటే చాలా నూనెల్లో గుండెకు హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది.


నూనె ఎంత తీసుకోవాలి?


ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 2 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అంటే 25 నుంచి 30 మి.లీ సరిపోతుంది. వారానికి సుమారు 150 నుంచి 170 మి.లీ సరిపోతుంది. అయితే ఈ మొత్తం వంట నూనె గురించి మాత్రమే. ఇందులో వేయించిన ఆహారాలు, బేకరీ వస్తువులు, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ వాటిలో ఎక్కువ మొత్తంలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది. ఈ మొత్తం ఆరోగ్యానికి సురక్షితం. శరీరానికి అవసరమైన శక్తి, పోషణను అందిస్తుంది. దీని కంటే ఎక్కువ నూనె తీసుకోవడం హానికరం.


డాక్టర్ ఏం చెప్పారంటే


​ఎక్కువ నూనె తీసుకోవడం ఎందుకు ప్రమాదం


ఎక్కువ నూనె తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే గుండెకి మంచిది కాదు. పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాల్ని పెంచుతాయి.


ఇక, ఊబకాయం సమస్య కూడా పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ సమస్య ఎక్కువైపోతుంది. ఒక్కసారి కొవ్వు పెరిగిందంటే తగ్గించుకోవడం చాలా కష్టం.


అంతేకాకుండా రక్తపోటు, డయాబెటిస్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.


గుండె ధమనులకు అడ్డంకులు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.


మనం ప్రతి వంటలో నూనె ఉపయోగిస్తున్నాం. దీంతో, తెలియకుండానే చాలా మంది ఎక్కువ మోతాదును తీసుకుంటున్నారు.


ఏ నూనె దేనికి మంచిది?


​ఎల్లప్పుడూ ఒకే నూనెను ఉపయోగించే బదులు.. సమతుల్య నూనెల మిశ్రమం మంచిదని నిపుణులు అంటున్నారు.


రోజువారీ ఉపయోగానికి ఆవ లేదా వేరుశెనగ నూనె మంచిదని చెబుతున్నారు.


అప్పుడప్పుడు పరిమిత పరిమాణంలో రైస్ బ్రౌన్ ఆయిల్ లేదా పొద్దు తిరుగుడు నూనె మంచి ఆప్షన్ అంటున్నారు.


సలాడ్ టెంపరింగ్ లేదా తేలికపాటి వంట కోసం ఆలివ్ ఆయిల్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు.


నెయ్యిని కూడా అప్పుడప్పుడు వంటల్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


గుండె కోసం ఏ ఆయిల్ వాడాలి


ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్


వేరుశెనగ నూనె


పొద్దు తిరుగుడు నూనె


ఆవ నూనె


సోయాబీన్ నూనె


** అయితే ఇవన్నీ రిఫైన్డ్ కాకుండా చూసుకోవాలి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ మాత్రమే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.


తక్కువ నూనెతో ఆహారం ఎలా వండాలి?


​నాన్ స్టిక్ లేదా ఐరన్ పాన్ ఉపయోగించండి. వీటిలో తక్కువ నూనెతో వంట చేయవచ్చు.


బాటిల్ నుంచి నేరుగా వంటల్లోకి నూనె వాడే బదులు టీస్పూన్‌తో నూనెను కొలిచి జోడించండి.


కూరగాయల్ని ఉడికించడం, ఆవిరి మీద వండటం, ఎయిర్ ఫ్రై వంటి పద్ధతుల్ని ఉపయోగించండి.


బయట దొరికే వేయించిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ తినడం నివారించండి. ముఖ్యంగా బజ్జీలు, పకోడీలు, నూడిల్స్ వంటివి ఎక్కువగా తినకండి. వీటిలో ఎక్కువ మోతాదులో నూనె ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa