ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం పోర్టు అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పోర్టుకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు రూ. 573.77 కోట్ల వ్యయంతో 6-లేన్ల ఎక్స్‌టర్నల్ పోర్ట్ కనెక్టివిటీ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా వివరాలు వెల్లడించారు.ఈ ప్రాజెక్టులో భాగంగా, జాతీయ రహదారి-216లోని మచిలీపట్నం బైపాస్ సెక్షన్ మీదుగా జాతీయ రహదారి-65, జాతీయ రహదారి-216 కూడలి నుంచి మచిలీపట్నం పోర్టు వరకు ఈ 6-లేన్ల రహదారిని నిర్మించనున్నారు. దీనివల్ల జాతీయ రహదారుల కారిడార్ నుంచి పోర్టుకు నేరుగా, వేగవంతమైన రవాణా సౌకర్యం కలుగుతుందని గడ్కరీ తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో సరుకు రవాణా వాహనాల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.ఆమోదం పొందిన ప్రాజెక్టులో 6-లేన్ల ప్రధాన రహదారితో పాటు సర్వీస్ రోడ్లు, 3 ఫ్లైఓవర్లు, ఒక ఓవర్‌పాస్ కమ్ రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం కూడా ఉన్నట్లు కేంద్రమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మచిలీపట్నం పోర్టు లాజిస్టిక్స్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa