చాలా మంది ఇష్టంగా తాగేవాటిలో టీ ముందుంటుంది. ఫుడ్ కంటే ఎక్కువగా టీనే ఇష్టపడతారు. అన్నం లేట్ అయినా పర్లేదు. టీ లేట్ అయితే అస్సలు తట్టుకోలేరు. దీనిని తాగడమే కాదు, దీని వల్ల అసలు లాభాలు ఏంటి, ఏమైనా సమస్యలొస్తాయో తెలుసుకుని తాగడం మంచిది. ఆ వివరాలని మనతో షేర్ చేసుకుంటున్నారు డాక్టర్ దీపక్ భాంగాలే.
టీని రుచి కోసం తాగడం మాత్రమే కాదు. దీనిని తాగడం వల్ల ఆరోగ్యం మెరగవుతుంది. ఇందులోని గుణాలు ఇమ్యూనిటీని బలంగా చేయడం దగ్గర్నుంచీ జీర్ణక్రియని మెరుగ్గా చేయడం వరకూ చాలా లాభాలున్నాయి. మానసిక చురుకుదనాన్ని పెంచుతాయి. టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. దీని వల్ల క్యాన్సర్, గుండె సమస్యల వంటి దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి.
రెగ్యులర్‌గా తాగితే
టీని రెగ్యులర్‌గా తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. టీలో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి మన బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి రక్తనాళాల పనితీరుని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా, కెఫిన్, L థియానిన్ అనే అమైనో యాసిడ్ వంటి ప్రత్యేక కలయిక చురుకుగా ఉండేలా చేస్తుంది. కాఫీ వల్ల కలిగే కంపనాలు లేకుండా దృష్టిని మెరుగ్గా చేస్తుంది. నార్మల్ టీ బదులు గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి జీవక్రియని పెంచుతాయి. కొవ్వు ఆక్సీకరణనకి హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా, బ్లాక్, గ్రీన్ టీలోని గుణాలు గట్ బ్యాక్టీరియాని పెంచుతాయి.
ఎంత పరిమాణంలో తాగాలి
మంచిది కదా అని రోజుకి పెద్ద పరిమాణంలో అంటే పెద్ద పెద్ద కప్పుల నిండా 4, 5 సార్లు తాగితే మంచిది కాదు. పెద్దవారు మీడియం సైజ్ కప్పుల్లో 2 నుంచి 3 సార్లు తాగొచ్చు. దీనిని స్వీట్ స్పాట్ అని చెబుతారు. కాబట్టి, అంతేపరిమాణంలో తాగడం మంచిది. అది కూడా పంచదార ద్వారా వచ్చే కేలరీలని గమనించండి. లేదంటే సమస్యలొస్తాయి.
ఎప్పుడు తాగాలి?
టీ మంచిదే. అయితే, దానిని సరైన సమయం అంటే ఉదయం లేదా మధ్యాహ్నం, లేదా లైట్ ఫుడ్ తర్వాత కనీసం గంట గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యలు రావు. ఆరోగ్యానికి మంచిది. కాబట్టి, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఎప్పుడు వద్దు?
మీ నిద్ర సమస్యల్ని దూరం చేయడానికి పడుకోవడానికి కనీసం 6 గంటల ముందు కెఫిన్ ఉన్న టీని తాగకపోవడమే మంచిది. కెఫిన్ అనేది నిద్ర సమస్యలకి కారణమవుతుంది. నిద్రపోయే ముందు తీసుకుంటే సరైన నిద్ర ఉండదు. కాబట్టి, ఆ టైమ్‌లో అసలే తాగొద్దు.
ఎక్కువగా తాగితే
టీని ఎక్కువగా అంటే రోజుకి 5, 6 కప్పుల కంటే ఎక్కువగా తాగడం వల్ల చాలా సమస్యలొస్తాయి. అందులో ముఖ్యంగా
ఐరన్ లోపం : టీలోని టానిన్స్ నాన్ హీమ్ ఐరన్(మొక్కల మూలాల నుండి) శోషణని నిరోధిస్తాయి.
జీర్ణ సమస్యలు : ఎక్కువగా టీ తాగడం వల్ల కెఫిన్, టానిన్ స్థాయిలు పెరిగి కడుపులో అసిడిటీ పెరుగుతుంది. దీని వల్ల గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు వస్తాయి.
నిద్ర సమస్యలు : కెఫిన్ కారణంగా ఎక్కువగా ఆందోళన, నిద్రలేమికి కారణమవుతుంది.
ఆల్రెడీ రక్తహీనత, కడుపు పూతల సమస్యలు ఉన్నవారు టీ తీసుకోవడం గురించి ముందుగా డాక్టర్‌ని కన్సల్ట్ తాగడం మంచిది.
ముఖ్యమైన రూల్ ఏంటంటే
ఐరన్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, భోజనం చేసిన వెంటనే టీ తాగొద్దు. ఉదాహారణకు పాలకూర, పప్పులు తీసుకున్న వెంటనే తాగొద్దు.
చక్కెర, బెల్లం ఏది బెటర్ :
టీలో కలిపేందుకు ఏది బెటర్ అని అడుగుతారు చాలా మంది. చక్కెరతో కంపేర్ చేస్తే బెల్లంలో ట్రేస్ మినరల్స్ ఉన్నప్పటికీ రెండూ రక్తంలో చక్కెరని పెంచుతాయి. ఆరోగ్యాన్ని కాపాడడం కోసం టీని రెండూ లేకుండా లేదంటే తక్కువ పరిమాణంలో మీకు నచ్చినది కలిపి తీసుకోండి.
పరగడపున టీ :
చాలా మంది ఉదయం లేవగానే ఏం తాగకుండా తినకుండా టీ తాగుతుంటారు. దీని వల్ల వికారం లేదా యాసిడ్ బ్రష్ వస్తుంది. ఎందుకంటే పాలలోని టానిన్స్ కడుపు పొరని చికాకుపెడతాయి.
మళ్ళీమళ్లీ వేడి చేసి తాగడం
కొంతమంది టీని మళ్లీ మళ్లీ వేడి చేసి లేదా బయట ఉన్న టీని వేడి చేసి తాగుతారు. దీని వల్ల టీ రుచి తగ్గడమే కాకుండా, పాలీఫెనాల్ స్థాయిలు తగ్గుతాయి. పాల ఆధారిత టీలలో బ్యాక్టీరియా పెరుగుతుంది. మొత్తంగా, టీని సరిగా తీసుకుంటే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. టీలలో గ్రీన్ టీ, హెర్బల్ టీలు మంచివి. అయితే, వీటిని సరైన సమయంలో సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa