భారత్-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌పై వివాదాలు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్తాన్ ప్రకటించింది. అయితే, ఐసీసీ చర్యలు, ఆర్థిక నష్టం, శ్రీలంక ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్ తన నిర్ణయం మార్చుకుంటుందని తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) 'ఫోర్స్ మజురే' నిబంధనను ఉపయోగిస్తూ మ్యాచ్‌ను తిరస్కరించడానికి లేఖ రాసింది. ఐసీసీ ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తే చర్యలు, నష్టపరిహారం తప్పవని హెచ్చరించింది. కొలంబోలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను ఆడాలని శ్రీలంక బోర్డు పాకిస్తాన్‌ను కోరింది. ఈ మ్యాచ్ రద్దు అయితే తమ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని శ్రీలంక పేర్కొంది.న్యూఢిల్లీలో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో చేతన్ శర్మ మాట్లాడుతూ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కేవలం బాంగ్లాదేశ్ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న నాటకాలని అభివర్ణించారు. "రాసిపెట్టుకోండి, ఫిబ్రవరి 12 తర్వాత పాకిస్థాన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. ఇది ఒక పొలిటికల్ గేమ్. బాంగ్లాదేశ్‌లో ఎన్నికలు ముగియగానే పరిస్థితులు మారిపోతాయి" అని ఆయన పేర్కొన్నారు. 'ప్రజల సెంటిమెంట్లను గౌరవిస్తూ, క్రికెట్‌ను కాపాడటం కోసం మేము భారత్‌తో తలపడతాం' అని పాక్ నేతలు త్వరలోనే ప్రకటనలు చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa