మారుతి సుజుకి తన మిడ్-సైజ్ ఎస్‌యూవీ విక్టోరిస్‌పై ఫిబ్రవరి నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ కారుపై రూ.78,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. LXi & VXi (పెట్రోల్, సీఎన్‌జీ): ఈ బేస్ వేరియంట్లపై మొత్తం రూ.50,000 వరకు తగ్గింపు ఉంది. ఇందులో రూ.30,000 కస్టమర్ ఆఫర్ కాగా, రూ.20,000 లాయల్టీ బోనస్ ఉంటుంది.ZXi & ZXi+: ఈ టాప్ ఎండ్ మోడళ్లపై రూ.61,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో రూ.41,000 ఆఫర్, రూ.20,000 బోనస్ కలిసి ఉన్నాయి.హైబ్రిడ్ వేరియంట్స్: పర్యావరణ హితమైన హైబ్రిడ్ మోడల్ ఎంచుకుంటే అత్యధికంగా రూ.78,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ.48,000 నేరుగా తగ్గింపు, రూ.30,000 లాయల్టీ బోనస్ ఉన్నాయి.ఈ ఆఫర్లు ఫిబ్రవరి నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa