ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి హైరిటర్న్స్ అందుకోవాలని కోరుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న క్రమంలో మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు. అలాగే ఇప్పటికే ఇన్వెస్ట్ చేస్తున్న వారిలోనూ చాలా మంది కొత్త ఫండ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ ఈ వారం పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం ఏకంగా 8 కొత్త ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి. నాలుగు ప్రముఖ అసెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ 8 న్యూ ఫండ్ ఆఫర్ తో వస్తున్నాయి. ఈ వారమే సబ్స్క్రిప్షన్ మొదలవుతోంది. వారి ఏ స్కీమ్ తేదీలు ఎప్పుడో తెలుసుకుందాం.
కొత్తగా వస్తున్న 8 ఫండ్స్‌లో మూడు ఫండ్ ఆఫ్ ఫండ్స్ (డొమెస్టిక్), రెండు థెమాటిక్ ఫండ్స్, ఒక ఈటీఎఫ్, ఒక లో డురేషన్ ఫండ్ ఉన్నాయి. ఫండ్ ఆఫ్ ఫండ్ కేటగిరీలో మీరే అసెట్ నిఫ్టీ మెటల్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 10వ తేదీన మొదలవుతోంది. ఫిబ్రవరి 23వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అలాగే గ్రో బీఎస్ఈ హాస్పిటల్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్స్క్రిప్షన్ సైతం ఫిబ్రవరి 10న మొదలై ఫిబ్రవరి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఏంజెల్ వన్ సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 9వ తేదీన మొదలై ఫిబ్రవరి 23వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఇక థెమాటిక్ ఫండ్ కేటగిరీలో బరోడా బీఎన్పీ పరిబాస్ ఈఎస్జీ బెస్ట్ ఇన్ క్లాస్ స్ట్రాటజీ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 12వ తేదీన మొదలవుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక ఐటీఐ బిజినెస్ సైకిల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 27వ తేదీ వరకు కొనసాగుతుంది. అలాగే ఇండెక్స్ ఫండ్ కేటగిరీలో గ్రో బీఎస్ఈ హాస్పిలట్ ఈటీఎఫ్ ఫండ్ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 11న మొదలై ఫిబ్రవరి 25వ తేదీ వరకు కొనసాగనుంది.
ఏంజెల్ వన్ సిల్వర్ ఈటీఎఫ్ సబ్స్క్రిప్షన్ ఫిబ్రవరి 9వ తేదీన మొదలై ఫిబ్రవరి 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇక బజాజ్ ఫిన్సర్వ్ లో డ్యూరేషన్ ఫండ్ సబ్స్క్రిప్షన్ సైతం ఫిబ్రవరి 9వ తేదీనే మొదలవుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa