శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అవాంఛిత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాడిగా నిలిచాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన శనక ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు.శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో బౌలర్ బారీ మెక్‌కార్తీ వేసిన ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ ఆడేందుకు శనక ప్రయత్నించాడు. అయితే, బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేవగా, ఫీల్డర్ మార్క్ అడైర్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో శనక డకౌట్‌గా వెనుదిరిగాడు. టీ20 కెరీర్‌లో శనకకు ఇది 16వ డకౌట్ కావడం గమనార్హం. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు రువాండా ఆటగాడు జాపీ బిమెన్‌యిమానా 15 డకౌట్లు పేరిట ఉండేది. తాజా డకౌట్‌తో శనక అతడిని అధిగమించాడు.ఈ జాబితాలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (14 డకౌట్లు) మూడో స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్ బ్యాటర్ సౌమ్య సర్కార్ (13) తర్వాతి స్థానంలో ఉన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విఫలమైనప్పటికీ శ్రీలంక విజయం సాధించింది. కుశాల్ మెండిస్ (56 నాటౌట్), కమిందు మెండిస్ (44) రాణించడంతో లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. అనంతరం, ఐర్లాండ్‌ను 143 పరుగులకే కట్టడి చేసి 20 పరుగుల తేడాతో గెలుపొందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa