ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొలి బంతికే వికెట్ తీసిన నేపాల్ యువ పేసర్ షేర్ మల్లా

sports |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 08:11 AM

నేపాల్ యువ పేసర్ షేర్ మల్లా తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్నాడు. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026 మ్యాచ్‌లో తను వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టి చరిత్ర సృష్టించాడు.గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను, ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతికే మల్లా పెవిలియన్‌కు పంపాడు. దీంతో, నేపాల్ తరఫున టీ20 అరంగేట్రంలో తొలి బంతికే వికెట్ తీసిన రెండో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో 2014లో మాజీ కెప్టెన్ పరాస్ ఖడ్కా ఈ ఘనత సాధించాడు. అయితే, తొలి బంతికే వికెట్ తీసినప్పటికీ ఈ మ్యాచ్‌లో మల్లా కాస్త ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. తన మూడు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో అరంగేట్ర ఆటగాడు జాకబ్ బెథెల్ (55), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (53) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో విల్ జాక్స్ కేవలం 18 బంతుల్లో 39 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోరు సాధించింది.ఛేదనలో నేపాల్ గట్టిగా పోరాడింది. కెప్టెన్ రోహిత్ పౌడెల్, దీపేంద్ర సింగ్ ఐరీ కీలక భాగస్వామ్యంతో జట్టును విజయానికి చేరువ చేశారు. చివరి ఓవర్‌లో 10 పరుగులు అవసరం కాగా, సామ్ కరన్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్‌కు ఉత్కంఠ విజయాన్ని అందించాడు. నేపాల్ తన తర్వాతి మ్యాచ్‌ను ఫిబ్రవరి 12న ఇదే మైదానంలో ఇటలీతో ఆడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa