కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో బ్రిటిష్ పాలనను మించిన నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయని.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే.. దాడులు, అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ శ్రేణుల దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను తన కుమార్తా కాకాణి పూజితతో కలిసి పరామర్శించిన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న ఆయన... ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందున.. వాటికి జవాబు చెప్పలేక అంబటిని అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. గర్జించే సింహం కంటే.. గాయపడ్డ సింహం ప్రమాదకరమని.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అరెస్టులతో భయపెట్టాలని చూడ్డం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa