ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభించాం: పవన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 11:57 AM

 మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘క్షేత్రస్థాయిలో ఉదాసీనంగా ఉంది. ఫలితాలు కనిపించడం లేదు. పథకాలు అమలు చేయడంలో ఎలాంటి మినహాయింపు లేదు. అద్భుతంగా చేశామంటున్నా.. కొన్ని చోట్ల గ్యాప్ ఉంది. ప్రాజెక్టులు పారదర్శంగా చేపట్టాలి. ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో కనిపించాలి. జలజీవన్ మిషన్ కింద పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభించాం. సీఎం, నేను అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకుంటున్నాం. అందుకే క్షేత్రస్థాయిలో ఫలితాలు రావాలని కోరుతున్నాం’ అని పవన్ అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధన కోసం పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖల పురోగతిపై సమీక్షించనున్నారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాల కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా అవేర్ సిస్టమ్, పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతికతల వినియోగంపై సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa