ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మధ్యతరగతి ఇళ్ల కోసం జియో స్మార్ట్ ఇన్వర్టర్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 11:43 AM

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో, ఇప్పుడు గృహ విద్యుత్ అవసరాలకు పరిష్కారం చూపనుంది. వేసవిలో కరెంటు కోతలు, ఉక్కపోతతో అల్లాడే ప్రజల కోసం మధ్యతరగతి బడ్జెట్‌కు తగినట్లుగా 'జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టమ్'ను తీసుకురావడానికి ముఖేష్ అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ₹20,000-₹30,000 వరకు ఖర్చయ్యే ఇన్వర్టర్లు, బ్యాటరీలు జియో ద్వారా కేవలం ₹5,000-₹9,000 మధ్యలో లభించే అవకాశం ఉంది. ఇది విద్యుత్‌తో పాటు సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా ఛార్జ్ అవుతుంది. మొబైల్ యాప్ ద్వారా నియంత్రణ, పవర్ వినియోగ ట్రాకింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ఈ కొత్త ఉత్పత్తితో జియో, లూమినస్, మైక్రోటెక్ వంటి ఇన్వర్టర్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.జియో పేరులోనే స్మార్ట్‌నెస్ ఉంటుంది. కాబట్టి, ఈ ఇన్వర్టర్లను మొబైల్ యాప్ ద్వారా నియంత్రించడం లేదా పవర్ వినియోగాన్ని ట్రాక్ చేసే ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు, టీవీ వంటి కనీస అవసరాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించేలా దీనిని డిజైన్ చేస్తున్నారట.జియో నెట్‌వర్క్ ఎలాగైతే ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి కంపెనీలకు సవాల్ విసిరిందో, ఇప్పుడు లూమినస్, మైక్రోటెక్, ఎక్సైడ్ వంటి ఇన్వర్టర్ దిగ్గజాలకు జియో రూపంలో గట్టి పోటీ ఎదురుకానుంది. తక్కువ ధరకే నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా జియో ఈ రంగంలోకి అడుగుపెడుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa