8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న సమయం చివరికి చేరింది. జీతాల పెంపు (Salary hike) విషయంలో కేంద్రం కీలక ముందడుగు వేసింది. 8వ పే కమిషన్ (8th Pay Commission) సంబంధిత అధికారిక ప్రక్రియలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జీతాలు, అలవెన్సులు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ (Fitment Factor) వంటి అంశాలపై ప్రభుత్వం ఉద్యోగుల అభిప్రాయాలను నేరుగా కోరుతోంది. ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తప్పక ఉపయోగించుకోవాలి.గతంలో, అభిప్రాయాలను తెలియజేయడానికి లెటర్లు రాయడం, ఆఫీసుల చుట్టూ తిరగడం వంటి పద్ధతులు ఉండేవి, కానీ ఈసారి పూర్తిగా డిజిటల్ విధానం అవలంబించబడింది. MyGov.in లో ప్రత్యేకంగా ఒక Questionnaire (సర్వే ఫారం) రూపొందించబడింది. పేపర్లు, ఈమెయిల్స్ లేదా PDFల రూపంలో అభిప్రాయాలను కమిషన్ స్వీకరించదు. కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేయవచ్చు.ఈ సర్వేలో ఎవరైనా భాగస్వామ్యం కావచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కోర్ట్ ఉద్యోగులు, జ్యుడీషియల్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఉద్యోగులు (Pensioners), ఫ్యామిలీ పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు (Unions) & అసోసియేషన్లు, రెగ్యులేటరీ బాడీ మెంబర్లు, ఆసక్తి ఉన్న సామాన్యులు, రీసెర్చర్లు ఇలా ఎవరికైనా అవకాశం ఉంది.వెబ్‌సైట్‌లో మొత్తం 18 ప్రశ్నల సర్వే ఫారం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, బేసిక్ పే పెరుగుదల, వార్షిక ఇంక్రిమెంట్స్, అలవెన్సులు, పెన్షన్ విధానాల్లో మార్పులు, మొత్తం పే హైక్ (Pay Hike) ఆశల గురించి ప్రశ్నలు ఉంటాయి. మీరు ఇచ్చే అభిప్రాయాలు కమిషన్ తుది సిఫార్సులలో కీలకంగా ఉపయోగపడతాయి.ఫీడ్‌బ్యాక్ సమర్పించడానికి చివరి తేదీ 16 మార్చి 2026. ఈ డేట్ దాటితే, అధికారికంగా అవకాశం కోల్పోతారు. అభిప్రాయాలు పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయి; కేవలం విశ్లేషణ కోసం మాత్రమే ఉపయోగిస్తారు, వ్యక్తిగత వివరాలు బయటకు రాదు.మీ కేటగిరీకి అనుగుణంగా ఉన్న డైరెక్ట్ లింక్ ద్వారా వెంటనే అభిప్రాయాన్ని సబ్మిట్ చేయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa