ట్రెండింగ్
Epaper    English    தமிழ்

E-Pantry | ఇకపై రైళ్లలో సులువుగా ఫుడ్‌ ఆర్డర్‌.. ఇ-ప్యాంట్రీ సేవలు అందుబాటులోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 10:28 PM

E-Pantry: భారతీయ రైల్వే (Indian Railways) ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త సదుపాయం ప్రవేశపెట్టింది. రైల్లో ఫుడ్ ఆర్డర్ చేసుకునేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) ఇ-ప్యాంట్రీ (E-Pantry) సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.ఈ సేవను మొదట వివేక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం 25 మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ప్యాంట్రీ కార్ కలిగిన ఎంపిక చేసిన రైళ్లలో ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.కోసం అర్హత: కన్ఫామ్ టికెట్‌, ఆర్‌ఏసీ లేదా పాక్షికంగా కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులు ఇ-ప్యాంట్రీ ద్వారా ముందుగానే ఆహారం ఆర్డర్ చేయవచ్చు. ప్యాంట్రీ కార్ స్టాఫ్ మీ సీటు దగ్గరే ఆహారం డెలివరీ చేస్తారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌లోని 'Booked Ticket History' సెక్షన్‌లో E-Pantry Meal Option కనిపిస్తుంది. ఆహారం బుక్ చేసిన వెంటనే వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, దీన్ని డెలివరీ సమయంలో చూపించాలి.విశాఖ నుండి వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ కూడా ఈ సదుపాయం పొందిన రైళ్ల జాబితాలో ఉంది. దశలవారీగా మిగతా రైళ్లకు కూడా ఈ సర్వీస్ విస్తరించనున్నారు. ఇ-ప్యాంట్రీ ద్వారా స్టాండర్డ్ మేల్ లేదా రైల్‌నియర్ మేల్ బుక్ చేసుకోవచ్చు. రైల్ ఎక్కాక ఆహారం కోసం ఆలోచించాల్సిన అవసరం లేకుండా, డిజిటల్ మోడ్‌లోనే చెల్లింపు చేయవచ్చు.ఫుడ్ బుక్ చేసిన వెంటనే వెరిఫికేషన్ కోడ్ అందుతుంది. ఆర్డర్ నుండి డెలివరీ వరకు ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. ఏ కారణం వల్లా ఆహారం డెలివరీ కాకపోతే, మీకు SMS లేదా ఇ-మెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆన్‌లైన్‌లోనే రీఫండ్ కూడా పొందవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa