రాబోయే 5 ఏళ్లలో అంటే 2027 నాటికి దాదాపు 99 శాతం ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రముఖ ఏఐ పరిశోధకుడు డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) మనుషుల కంటే మెరుగ్గా ఆలోచించగలదని, దీనివల్ల నిరుద్యోగిత శాతం 99% కి చేరుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే, హ్యూమన్ క్రాఫ్ట్స్, హ్యూమన్ ఫీలింగ్, సూపర్‌విజన్, మధ్యవర్తులు, వ్యక్తిగత ప్రాధాన్యత వంటి 5 రకాల పనులు మాత్రమే కొంతకాలం మనుగడ సాగించగలవని పేర్కొన్నారు. 2045 నాటికి మానవాళి 'టెక్నలాజికల్ సింగ్యులారిటీ' దశకు చేరుకుంటుందని, ఈ మార్పును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు.ఏజీఐ వచ్చిన మూడేళ్లకు లేబర్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది. ఏఐ టూల్స్, హ్యుమనాయిడ్ రోబోలతో మనుషులు చాలా చవకగా పని చేయించుకుంటారు. అంతేకాకుండా, కంప్యూటర్ లో చేసే ప్రతి పని ఏఐ టూల్స్ తో ఆటోమేటిక్ అయిపోతుంది” అని యాంపోల్ స్కీ పేర్కొన్నారు. హ్యుమనాయిడ్ రోబోలు కేవలం ఐదేండ్ల దూరంలో ఉన్నాయని, వాటి రాక తర్వాత ఫిజికల్ లేబర్ ఆటోమేటెడ్ అయిపోతుందని ఆయన చెప్పారు. దానితో పాటు ఉద్యోగాలన్నీ ఆటోమేటెడ్ అయిపోతాయని, ఏఐకు ప్రత్యామ్నాయమే లేదని తెలిపారు. కాగా.. ఈ ఏడాది మేలో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమొడెయ్ కూడా ఇలాగే హెచ్చరించారు. ఏఐతో 50 శాతం వైట్ కాలర్ జాబ్స్ లో కోతపడుతుందని ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa