ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్‌కప్‌.. నమీబియాపై భారత్ తుది జట్టులో మార్పులు?

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 07:31 PM

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో 1-2 మార్పులు జరిగే అవకాశం ఉంది. తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతున్న అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తాడు. అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా పేస్ బౌలర్లుగా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్నర్లుగా ఆడనున్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ ఫినిషర్లుగా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు మోయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa