తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ తిరుమల లడ్డు వ్యవహారంలో మా వాళ్లు ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలని చూస్తున్నారని చెప్పారు అని వైసీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. అయన మాట్లాడుతూ... వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉన్న ఎమ్మెల్యేతో స్వామి వారే నిజం చెప్పించారు. ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్లి లడ్డూలో నెయ్యి కల్తీ చేయమని చెప్తాడా అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ రెండోరోజు మాట మార్చారు. సబ్జెక్ట్ లేనప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తప్పు చేశారని చెప్పాలనుకున్నాడు, కానీ స్వామి వారు ఆయన గతంలో ఏం చేశాడో బయటపెట్టిస్తున్నారు. శ్రీవారే తిరుపతి ఎమ్మెల్యేతో నిజం చెప్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అపచారాలను వాళ్ల ఎమ్మెల్యేలే బయటపెడుతున్నారనే విషయం గుర్తుంచుకోవాలని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa