ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో హెల్త్ బ్రాండ్ కొనుగోలు చేసిన రిలయన్స్

business |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 02:59 PM

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వ్యాపార విస్తరణలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన గుడ్ నెస్ గ్రూపులో మెజారిటీ వాటాను దక్కించుకున్న రిలయన్స్, తాజాగా తమిళనాడుకు చెందిన సదరన్ హెల్త్ ఫుడ్స్ ను రూ.156.42 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తుల రంగంలోకి రిలయన్స్ ప్రవేశించింది. మన్నా బ్రాండ్ పేరుతో ఈ సంస్థ రెండు దశాబ్దాలుగా ఆరోగ్య ఆహార ఉత్పత్తులను అందిస్తోంది. ఈ కొనుగోలుతో రిలయన్స్ తన వ్యాపార పోర్ట్ ఫోలియోను మరింత విస్తరిస్తోంది.ఈ సంస్థకు చెందిన మన్నా బ్రాండ్ పేరుతో మొత్తం పాతిక కంటే ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందిస్తోంది. చిన్నారుల నుంచి అన్ని వయసుల వారికి అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్న ప్రజల తీరుకు అనుగుణంగా ఈ సంస్థ కొనుగోలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు.. దక్షిణాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న మన్నా బ్రాండ్ రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా పాపులర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతారు. ఇక్కడో ఆసక్తికర అంశాన్ని చెప్పి ముగించాలి. గడిచిన ఐదేళ్ల కాలంలో పాతిక కంటే ఎక్కువ సంస్థల్ని రిలయన్స్ ను కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.లక్ష కోట్లను వినియోగించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa