ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌పై ఇటలీ ఘన విజయం

sports |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 06:28 PM

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇటలీ నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక్క వికెట్‌ను కోల్పోకుండా గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆరిఫ్ షేక్ (27) టాప్ స్కోరర్. రోహిత్ పౌడెల్ (23), ఆసిఫ్‌ షేక్ (20), కరణ్ కేసీ (18*), దీపేంద్ర సింగ్ (17) పరుగులు చేశారు. ఒక దశలో 93/3తో ఉన్న నేపాల్.. చూస్తుండగానే కుప్పకూలింది. ఆ జట్టు 30 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇటలీ బౌలర్లలో క్రిషన్ 3, బెన్ మన్నెంటి 2, అలీ హసన్, స్మట్స్, జస్‌ప్రీత్‌ సింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa