వాలెంటైన్స్ డే నాడు ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే పూల వెనుక పర్యావరణానికి హాని కలిగించే చీకటి కోణాలున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క ప్రేమికుల దినోత్సవం సందర్భంగానే వేల టన్నుల కర్బన ఉద్ఘారాలు విడుదలవుతున్నాయని, పూల పెంపకంలో ఆహార పంటల కంటే 50 రెట్లు ఎక్కువ పురుగుమందులు వాడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల కార్మికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. పూలు వాడిపోకుండా వాడే రసాయనాలు, ప్యాకేజింగ్‌కు వాడే ప్లాస్టిక్ భూమికి నష్టం కలిగిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.