వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీలతో పాటు వివిధ రకాల పౌరసేవలను సులభతరం చేసే వాహన్ పోర్టల్ వచ్చే మార్చిలో అందుబాటులోకి రానుంది. తొలుత సికింద్రాబాద్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, అనంతరం గ్రేటర్లోని ఇతర రవాణా కార్యాలయాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 16 నుంచి ఆర్టీఏ అధికారులు, ఉద్యోగులు, ఆటోమొబైల్ డీలర్లకు ఈ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణనివ్వనున్నారు. గ్రేటర్లో 89 లక్షల వాహనాలున్నాయి. మార్చి నుంచి వాహనాలకు సంబంధించిన 52 రకాల సేవలను వాహన్ పోర్టల్ ద్వారా అందిస్తారు. అంతర్రాష్ట్ర, జిల్లాల మధ్య వాహనాల బదిలీలకు నిరభ్యంతర పత్రాలు అవసరం ఉండదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa