విశాఖపట్నం వాసులకు ముఖ్యమైన గమనిక.. ఫిబ్రవరి 15న (ఆదివారం) మహా శివరాత్రి నాడు మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించారు. జీవీఎంసీ (మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ) పరిధిలోని అన్ని మాంసం షాపుల్ని (మాంసం, చికెన్, చేపలు వంటివి) 15వ తేదీ మహా శివరాత్రి సందర్భంగా మూసివేస్తారు. ఈ మేరకు షాపులు, జంతు వధశాలలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు.
'ఫిబ్రవరి 15 మహా శివరాత్రి మాత్రమే కాదు.. 2026లో మరికొన్ని జాతీయ సెలవు దినాలలో, పర్వదినములలో నగరంలో వేటమాసం, కోడి మాంసం, చేపలు, రొయ్యలు అమ్మకాలు నిషేధించారు. సంబంధిత షాపుల్ని, జంతు వధశాలలకు సెలవు ప్రకటించడమైనదని, సంబంధిత దుకాణాలు, జంతు వధశాలలు మూసివేయాలని, అతిక్రమించి మాంసపు దుకాణదారులు ఎవరైనా తమ దుకాణాలను తెరిచి మాంసము, చేపలు, రొయ్యలు విక్రయించినా, జంతు వధ శాలలు తెరిచిన యెడల జీవీఎంసీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగునని కమిషనర్ తెలియజేశారు. మాంసం, చేపలు, దుకాణదారులు, జంతు వధశాలలు ఈ క్రింది తెలిపిన తేదీలైన జాతీయ సెలవు దినాలను, పర్వదినాలను గమనించి ఆయా తేదీలలో స్వచ్చంధంగా దుకాణాలను మూసివేయాలి' అని కమిషనర్ తెలిపారు. అలాగే ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అయితే ఆదివారం రోజు వచ్చే పర్వదినాల రోజు మాంసం షాపులు మూసివేయడం
నాన్వెజ్ ప్రియులకు కాస్త ఇబ్బందేనని చెప్పాలి.
వాళ్లందరికి షాక్.. ఆస్తులు సీజ్ చేస్తున్నారు.. మీరు ఉన్నారేమో, చెక్ చేస్కోండి
1 మహా శివరాత్రి 15.02.2026 - ఆదివారం
2 శ్రీరామ నవమి 27.03.2026 - శుక్రవారం
3 మహావీర్ జయంతి 31.03.2026 - మంగళవారం
4 మేడే 01.05.2026 - శుక్రవారం
5 బుద్ద జయంతి 01.05.2026 - శుక్రవారం
6 స్వాతంత్ర దినోత్సవం 15.08.2026 - శనివారం
7 శ్రీ కృష్ణాష్టమి 04.09.2026 - శుక్రవారం
8 గాంధీ జయంతి 02.10.2026 - శుక్రవారం
9 ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం 01.11.2026 - ఆదివారం
10 సాదు టి.ఎల్.వాశ్వాని జయంతి 25.11.2026 - బుధవారం
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa