ట్రెండింగ్
Epaper    English    தமிழ்

24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు...

business |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:37 AM

బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,310 తగ్గి రూ.1,56,440 పలుకుతోంది. 22 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.1,200 తగ్గి రూ.1,43,400 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.అయితే ఫిబ్రవరి నెల వచ్చేసరికి బంగారం ధరలు దిగిరావడం సాగుతుంది. మునుముందు బంగారం ధరలు మరింతగా దిగివచ్చే అవకాశాలు ఉన్నాయనే నిపుణుల అంచనాలు పసిడి ప్రియులను ఊరిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాల మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గుల ర్యాలీ కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.సోమవారం వెండి ధరలు వరుసగా ఐదో రోజు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 2,80,000వద్ద నిలిచింది. జనవరి 29న ఆల్ టైమ్ రికార్డు ధర రూ.4,25,000 నమోదు చేసిన వెండి ధరలు ఆ తర్వాత భారీ హెచ్చు తగ్గుదలకు గురవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa