మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ కిరాతక ప్రియుడు తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేశాడు. పెళ్లి విషయంలో తలెత్తిన గొడవ చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ద్వారకాపురి ప్రాంతంలోని ఓ అద్దె గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా.. బెడ్‌పై యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది.నిందితుడు పీయూష్ ధమ్నోడియా, మృతురాలు (24) ఇద్దరూ కలిసి ఎంబీఏ చదువుతున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, పెళ్లి విషయంలో గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. నిందితుడి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో గొడవ పెద్దదైంది. ఫిబ్రవరి 12న గదిలో చర్చించుకుంటున్న సమయంలో మళ్లీ వాగ్వివాదం జరగడంతో ఆవేశంలో పీయూష్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు.హత్య అనంతరం నిందితుడు మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్ గదిలో ఉంటూ.. మంత్ర తంత్రాలతో చనిపోయిన తన ప్రియురాలి ఆత్మను తిరిగి పిలిపించవచ్చని భావించి వింత పూజలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ తర్వాత ముంబైకి చేరుకుని లోకల్ ట్రైన్లలో తిరుగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. నిందితుడు తన కూతురి అశ్లీల ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో వైరల్ చేస్తానని భయపెట్టేవాడని, తన కాలేజీ ఫీజులు కట్టమని ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేవాడని ఆరోపించారు. నిందితుడు ఆమె మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేయగా, పోలీసులు ఆ డిజిటల్ సాక్ష్యాల కోసం ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa