ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు పాలనలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దయనీయంగా మారింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:16 PM

వెనుబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంటే చంద్రబాబుకి మొదటి నుంచీ చాలా చిన్నచూపని, అందువల్లే ఆయా వర్గాలకు చెందిన సంక్షేమ హాస్టళ్ల పట్ల ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. అది కచ్చితంగా కులవివక్ష అని  వైయ‌స్ఆర్‌సీపీ  ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లలో 900 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారని వెల్లడించారు. జాతీయ మానవ హక్కుల వేదిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 2019 నుంచి మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఘటనల కన్నా ఎక్కువని తెలిపారు. విద్యార్థుల దుర్భర పరిస్థితుల మధ్య చదువలు సాగించలేని పరిస్థితులుంటే మంత్రి లోకేష్‌ మాత్రం ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరుగుతూ జల్సాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బిల్‌గేట్స్‌ పర్యటనలో చేస్తున్న ఖర్చులను సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి కోసం వెచ్చించినా విద్యార్థులు ఆస్పత్రులపాలు కావాల్సిన దుస్థితి రాదని టీజేఆర్‌ సుధాకర్‌బాబు తేల్చి చెప్పారు. వెంటనే బిల్‌గేట్స్‌ పర్యటన ఖర్చు వివరాలు వెల్లడించాలని సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa