ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకి పాల్పడిన తల్లిదండ్రులు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:17 PM

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో సోమవారం ఉదయం వెలుగుచూసిన హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.దర్దేయి గ్రామానికి చెందిన కృష్ణ పటేల్ (48), రమాబాయి పటేల్ (47) దంపతులకు ఆదిత్య పటేల్ (21) అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. 2024లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆదిత్య మరణించాడు. అప్పటి నుంచి ఆ దంపతులు తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లోని వేప చెట్టుకు ఒకే చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాలుగు పేజీల సూసైడ్ నోట్‌తో పాటు ఒక వీడియో సందేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. "మా జీవితానికి మా కుమారుడే పునాది. వాడు లేని జీవితం మాకు శూన్యం. పూర్తి స్పృహతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. దీనికి ఎవరూ బాధ్యులు కారు" అని లేఖలో పేర్కొన్నారు. తమ కుమారుడికి రావాల్సిన పరిహారం డబ్బులను కృష్ణ పటేల్ సోదరులకు ఇవ్వాలని వీడియోలో కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa