ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మండలిలో బొత్స సత్యనారాయణకు అస్వస్థత.. హుటాహుటిన వైద్యులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 06:12 PM

మాజీ మంత్రి, శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఏపీ శాసనమండలి సమావేశాలు వాడీవేడీగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శాసనమండలి సమావేశాలకు హాజరైన బొత్స సత్యనారాయణ.. మాట్లాడుతున్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు వెంటనే వైద్యులను పిలిపించారు. బొత్స సత్యనారాయణను పరీక్షించిన వైద్యులు బీపీ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బొత్సకు బీపీ 190/120గా ఉన్నట్లు గుర్తించారు. బీపీలో హెచ్చుతగ్గులే అస్వస్థతకు కారణమని తెలిపారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.


సభలో మాట్లాడుతున్న సమయంలో అస్వస్థత కారణంగా బొత్స సత్యనారాయణ తూలిపడబోయారు. దీంతో పక్కనే ఉన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అప్రమత్తమై ఆయనను పట్టుకున్నారు. అనంతరం అసెంబ్లీ వర్గాలు అత్యవసరంగా వైద్యులను రప్పించాయి. బొత్స సత్యనారాయణ ఛాంబర్‌లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. బీపీలో హెచ్చుతగ్గులే అస్వస్థతకు కారణమని.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.


మరోవైపు ఈ సంగతి తెలిసిన వెంటనే సిటీ న్యూరో ఆస్పత్రి వైద్యులు చంద్రశేఖర్ రెడ్డి బొత్స సత్యనారాయణకు ఫోన్ చేశారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు చెప్పారు. అనంతరం బొత్స సత్యనారాయణ శాసన మండలి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. బొత్స సత్యనారాయణ హైబీపీతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. బీపీలో హెచ్చుతగ్గులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు బొత్స సత్యనారాయణ ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో బొత్స సత్యనారాయణకు చికిత్స అందించారు.


ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన బొత్స సత్యనారాయణ.. మళ్ళీ శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. అయితే మాట్లాడుతున్న సమయంలో బీపీ పెరిగి అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సూచనతో తిరిగి ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు బొత్స సత్యనారాయణకు బీపీ అధికంగా ఉండటంతోనే ఇటీవల ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుటుంబసభ్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో సిటి న్యూరో ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు. అయితే మరోసారి బీపీ అధికంగా నమోదు కావటంతో.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa