యాపిల్ గతంలో తన యాప్ స్టోర్ నుండి 6 లక్షలకు పైగా యాప్‌లను తొలగించింది. ఇప్పుడు అదే బాటలో ప్లే స్టోర్‌లో ఉన్న దాదాపు 9 లక్షల యాప్‌లను తొలగించేందుకు గూగుల్ సిద్ధమవుతోంది. గత రెండేళ్లుగా ఎలాంటి అప్‌డేట్‌లు లేని యాప్‌లకు గూగుల్ పలుమార్లు సూచనలు చేసింది. అయినప్పటికీ వాటి నుంచి స్పందన లేకపోవడంతో తొలగించాలని నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా ఎలాంటి అప్‌డేట్ లేని 8.69 లక్షల యాప్‌లు తొలగించేందుకు గూగుల్ నిర్ణయం తీసుకుంది. దీంతో యూజర్లు వీటిని డౌన్‌లోడ్ చేయలేరు. యూజర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ వెల్లడించింది.
ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం, గూగుల్ ఈ చర్య తీసుకున్న తర్వాత, ప్లే స్టోర్‌లోని మూడింట ఒక వంతు యాప్‌లు తీసివేయబడతాయి. రెండు ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు 15 లక్షల యాప్‌లను తొలగించినట్లైంది. యాపిల్ ఇటీవల యాప్ స్టోర్ నుంచి 6 లక్షల 50 వేల యాప్‌లను తొలగించింది. అదే సమయంలో, గూగుల్ 8,69,000 యాప్‌లను తొలగించనుంది. యాప్ డెవలపర్‌లు గత రెండేళ్లలో ఒక్క సెక్యూరిటీ అప్‌డేట్‌ను కూడా విడుదల చేయలేదు. అప్‌డేట్ చేయకపోవడంతో యూజర్ల వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.