ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫోన్ ల నుంచి వ్యక్తిగత డేటాను సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారు. కొన్ని యాప్స్ కూడా వ్యక్తిగత డేటాను దొంగలిస్తున్నాయి. తాజాగా 'ఫేస్ స్టీలర్'గా పిలవబడే స్పైవేర్ డేటాను వేగంగా దొంగిలిస్తున్నట్లు 'ట్రెండ్ మైక్రో' అనే నివేదిక పేర్కొంది. ఫేస్‌బుక్ సహా ప్రముఖ సోషల్ మీడియా యాప్ ల పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర సున్నితమైన డేటాను ఈ 'ఫేస్ స్టీలర్' దొంగిలిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో 7 ఆండ్రాయిడ్ యాప్‌లలో స్పైవేర్‌ను గుర్తించినట్లు తెలిపింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన గూగుల్ ఈ 7 యాప్‌లను తన ప్లేస్టోర్‌ను తొలింగించింది. మీ మొబైల్‌లోనూ ఈ యాప్‌లుంటే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసుకోండి.
'ఫేస్ స్టీలర్' స్పైవేర్‌ను గుర్తించిన యాప్‌లివే..
1.డైలీ ఫిట్‌నెస్ ఓఎల్
2.ఎంజాయ్ ఫొటో ఎడిటర్
3.పనోరమా కెమెరా
4.ఫొటో గేమింగ్ పజిల్
5. స్వామ్ ఫొటో
6.బిజినెస్ మెటా మెనేజర్
7. క్రిప్టోమైనింగ్ ఫార్మ్ యువర్ ఓన్ కైన్