ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం అవసరం

Education |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 10:00 AM

ప్రకృతి, జీవవైవిధ్యంపై విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం అవసరమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక రాష్ట్ర బాధ్యుడు ఎల్.ఎస్.భాస్కరరావు అన్నారు. మే 22 వ తేదీ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం పురస్కరించు కొని శనివారం మండవల్లి గ్రంథాలయంలో నిర్వహించి న 5.వ రోజు వేసవి విజ్ఞాన శిరమునందు ఆయన పాల్గొని ప్రకృతి, చిత్తడినేలు, జీవరాశుల పరిరక్షణ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.


గ్రంథాలయ అధికారిని షేక్ పర్వీన జీవ వైవిద్య దినోత్సవం పై ప్లే కార్డులు ప్రదర్శించి, న్యూస్ పేపర్ల లోను, సెల్ ఫోన్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని చదివి వినిపించి, విద్యార్థులతో చదివించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ.. ప్రకృతిలో సకల జీవరాశుల జీవనం పరస్పర ఆధారితమని, జీవవైవి ద్య సమతుల్యం తోనే సమస్త జీవరాశుల మనుగడ సాధ్యపడుతుందని అన్నారు.


పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల సహజ వనరుల పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. కాలుష్యం పెచ్చరిల్లు తొందన్నారు. మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని అనేక రకాలుగా ధ్వంసం చేస్తున్నాడు, అడవులు నరకడం, రసాయన ఎరువులు, ప్లాస్టిక్ వినియోగం, ఖనిజాల కోసం పర్వతాలను తవ్వడం లాంటి చర్యల ఫలితంగా అసంఖ్యాక జంతు, వృక్ష జాతులు అంతరించి ప్రకృతి, జీవవైవిధ్యం పై పరిరక్షణభూతాపం అంతకంతకూ పెరగటం వల్ల 2050 నాటికి నాలుగింట ఒక వంతు సున్నితమైన జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం దాపురించిం దని నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


ఫలితంగా సముద్రతీరాలు, అడవులు, చిత్తడి నేలలు అతలాకుతలమౌతున్నాయి. దీనితో భూకంపాలు, వరదలు, సునామీలు వంటి విపత్తులు జీవి వైవిధ్యానికి పెను సవాలుగా మారుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలవల్ల ఆహార భద్రతకు ఆరోగ్యానికి ఆరోగ్యానికి ముప్పు ఏర్పడింది. జీవవైవిధ్య చిత్తడినేలల కొల్లేరు సరస్సు కూడా ఆక్రమణలతో కుంచించుకుపోయి జీవరాశుల మనుగడకు తీవ్ర ప్రమాదం వాటిల్లింది అన్నారు. జీవవైవిద్య వనరుల పరిరక్షణలో విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలని, అందుకోసం జిల్లా, మండల స్థాయిల్లో పటిష్టమైన కార్యక్రమాలు రూపొందించి పౌర సమాజానికి అవగా హన కల్పించా ల్సిన అవసరం ఉందని భాస్కర రావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com