వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం అంగళూరు గ్రామంలో వేంచేసియున్న నీలంపాటి అమ్మవారి తిరునాళ్ల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎమ్యెల్యే బొల్లా బ్రహ్మనాయుడును సత్కరించారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ ప్రభలను సందర్శించి భక్తులకు శుభాకాంక్షలు తెలియచేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa