తెలంగాణలో టెన్త్ సిలబస్ ను భారీగా తగ్గించారు. సిలబస్ లో ఉన్న 25 శాతం అంశాలను పబ్లిక్ పరీక్షలకు పరిగణించకుండా గుర్తించి వాటిని కేవలం ప్రాజెక్టులు మరియు కృత్యాధార అభ్యసనానికి పరిమితం చేశారు. అధ్యాయం వారీగా తొలగించిన అంశాలు 1.వాస్తవ సంఖ్యలు (ఏమీ తొలగించలేదు) 2.సమితులు(ఏమీ తొలగించలేదు) 3.బహుపదులు-(బహుపదుల భాగాహారం) 4.రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత (రేఖియ సమీకరణాలు గా మార్చ బడే సమీకరణాల సాధన) 5.వర్గ సమీకరణాలు (వర్గ సమీకరణాల పై రాత లెక్కలు, వర్గం పూర్తి చేయడం ద్వారా సమీకరణ సాధన) 6.శ్రేడులు (n పదాల మొత్తం కు సంబంధించిన నిజ జీవిత సమస్యలు, GP) 7.నిరూపక రేఖాగణితం (త్రిభుజ వైశాల్యము మరియు దానికి సంబంధించిన లెక్కలు) 8.సరూప త్రిభుజాలు (సరూప త్రిభుజాలు వైశాల్యాలు, పైథాగరస్ సిద్ధాంతం విపర్యయం, అపక్రమ భిన్నం ఆధారంగా సరూప త్రిభుజాలు నిర్మాణం)
9.వృత్తానికి చేదన రేఖలు, స్పర్శరేఖలు (అధిక వృత్త ఖండం, అల్ప వృత్త ఖండం పై సమస్యలు) 10.క్షేత్రమితి (3-D ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మారే సమస్యలు) 11.త్రికోణమితి (0-90 డిగ్రీల త్రికోణమితి నిష్పత్తులు, పూరక కోణాలు) 12.త్రికోణమితి అనువర్తనాలు (పూరక కోణాలకు సంబంధించిన సమస్యలు) 13.సంభావ్యత(ఏమీ తొలగించలేదు) 14.సాంఖ్యక శాస్త్రం (సోపాన విచలన పద్దతి, ఓగివ్ వక్రాలు)
నూతన పబ్లిక్ పరీక్షలు-ప్రశ్నాపత్రం Part-A Section-1 Group-A ఇందులో ఆరు ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. మూడింటిని మాత్రమే చేయాలి. ఒక్కొక్క జవాబుకు 2 మార్కులుGroup-Bఇందులో ఆరు ప్రశ్నలు ఇవ్వబడతాయి. మూడింటిని మాత్రమే చేయాలి. ఒక్కొక్క జవాబుకు 2 మార్కులు Section-2 ఇందులో 8 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 4 మాత్రమే చేయాలి. ఒక్కొక్క జవాబుకు 4 మార్కులు Section-3Group-Aఇందులో 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఏదేని రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాలి. Group-B ఇందులో 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఏదేని రెండు ప్రశ్నలకు మాత్రమే జవాబు రాయాలి. Part-Bఅన్ని Multiple choice questions ఇవ్వబడతాయి.ప్రతి జవాబుకు 1 మార్క్.