కుందుర్పి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా కుందుర్పమ్మ జాతర నిర్వహించారు. ఈ దేవాలయంలో హుండిలోకి భక్తాదులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడి ఉన్నవారు డబ్బులు హుండిలో వేశారు. శనివారం దేవాలయంలో గ్రామ సర్పంచ్ కొల్లారప్ప మారుతీశ్వరి, రామమూర్తి, ధర్మకర్త సత్యనారాయణ శాస్త్రి, దేవాలయాల అర్చకుడు నాగరాజు, తలారి పెద్ద ఓబులేష్ తదితరుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఈ హుండిలో శ్రీ కుందుర్పమ్మ దేవతకు రూ, 60, 020లు ఆదాయం చేకూరినట్టు గ్రామ పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎస్ బి లక్ష్మీ అజయ్ బాబు, మాజీ జడ్పిటిసి రాజగోపాల్, స్థానిక జిల్లా ఉన్నత పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ కె. లక్ష్మణ మూర్తి, గ్రామ పెద్దలు, ఎస్. శ్రీనివాసులు, మంజు, నాగేంద్ర , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.