కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. కనీస హాజరు శాతం నుంచి విద్యార్థులకు మినహాయింపునిచ్చింది. హాజరుతో పనిలేకుండా జూలైలో జరగనున్న బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు రాసుకోవచ్చు. గతంలో విద్యార్థులకు కనీసం 75% హాజరు తప్పనిసరిగా ఉండేది. మరోవైపు సెమిస్టర్ పరీక్షల్లో చాయిస్ ప్రశ్నలను సైతం కొనసాగిస్తున్నట్టు జేఎన్టీయూ తెలిపింది.