ఆంధ్రప్రదేశ్ లో బుధవారం నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మొదలు కానున్నాయి.జూలై 15 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.ఉదయం 9:30 పరీక్ష మొదలవుతుంది.ఈ ఏడాది రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపు ఇచ్చింది.దీంతో దాదాపు 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా హాల్‌టికెట్లు జారీ అయ్యాయి.అలాగే సప్లిమెంటరీలో పాసైన వారినీ రెగ్యులర్ పాస్ గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.