తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూహెచ్ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత నెల 18 నుంచి 21 వరకు ఇంజినీరింగ్, 30, 31న అగ్రికల్చర్, ఫార్మా ఎంసెట్ పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్‌కు 1, 56, 812 మంది, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల కోసం 80, 575 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
త్వరలోనే కౌన్సెలింగ్: మంత్రి సబిత
ఫలితాలు విడుదల చేసిన అనంతరం మంత్రి సబిత మాట్లాడారు. ఇంజినీరింగ్‌లో 80. 41 శాతం, అగ్రికల్చర్‌లో 88. 34 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆమె చెప్పారు. విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభవుతుందన్నారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కౌన్సెలింగ్ సెంటర్‌లో కళాశాలలు, కోర్సుల వివరాలు వెల్లడిస్తారని మంత్రి వివరించారు.