దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని 20 నిమిషాలు పెంచారు. ఒక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించం అని ఎన్టీఏ వెల్లడించింది. వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 60 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు.