మేషం
మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు.
వృషభం
వ్యాపార ఉద్యోగాలలో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
మిధునం
నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు ఆప్తుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.
కర్కాటకం
కుటుంబ సభ్యుల నుండి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు. పాత ఋణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వ్యాపార వ్యవహారాలలో ఒడిదుడుకులు తప్పవు.
సింహం
రావలసిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో శ్రమ అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.
కన్య
వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
తుల
బంధు మిత్రులతో వివాదాలు తీరుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
వృశ్చికం
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక సమస్యలు కలుగుతాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమౌతాయి.
ధనస్సు
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రశాంతత కోసం దైవదర్శనం చేసుకోవడం మంచిది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
మకరం
నూతన వస్తు లాభాలు పొందుతారు. సమాజంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితులు నుండి కీలక సమాచారం అందుతుంది.
కుంభం
అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు. ఇంటాబయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. బంధు మిత్రుల మాటలు కొంత ఇబ్బందికలిగిస్తాయి.
మీనం
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు.