మేషం
మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన పనులో ప్రతిష్టంభనలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు చేస్తారు.
వృషభం
సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు.
మిధునం
స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్నంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
కర్కాటకం
సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు లో శ్రమాధిక్యత కలుగుతుంది. ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.
సింహం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కన్య
పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల
వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది. కుటుంబ సభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. స్ధిరాస్తి సంభందిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు.
వృశ్చికం
వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ధన పరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు.
ధనస్సు
కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి.నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.
మకరం
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వాహన భూ లాభాలు ఉంటాయి. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభం
ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి.
మీనం
సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు.