ఆగష్టు 01 నుండి 20 వార్తకు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్డు ప్రమాదాలు, జూదం, కోడి, గొర్రె పందాలు నియంత్రణకు, సారా, మద్యం, నిషేధిత గుట్కాలు, గంజాయి, ఇసుక, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టారు.
మద్యం, నాటుసారా అక్రమ రవాణ, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు, SEB వారు రైడ్ చేసి, సంయుక్తంగా 20 కేసులు నమోదు చేసి, 23 మంది ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 23 లీటర్ల నాటు సారా మరియు 3289 మద్యం పాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు .
మాదకద్రవ్యాల పై జరిపిన దాడులలో బాగంగా 2 కేసులు నమోదు చేసి, ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారివద్దనుండి 06 ½ KG ల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు .
హెల్మెట్ లు, సీటు బెల్టులు ధరించకుండా వాహనాలు నడిపిన వారిపైనా వాహనాలను అతి వేగంగా నడిపిన వారిపైన, ఎం.వి. నిబంధనలను అతిక్రమించిన వారిపై 13463 కేసులను నమోదు చేసి, రూ. 29,64,963/- లను ఈ-చలానగా విధించారు.
నిషేధిత పొగాకు ఉత్పతులపై జరిపిన దాడులలో బాగంగా 34 కేసులు కట్టి 34 మంది ముద్దయిలను అరెస్ట్ చేసి వారి వద్దనుండి Rs. 2,14,501/- విలువగల 11493 పాకెట్స్ ను స్వాదీనం చేసుకున్నారు.దిశా యాప్ ఇంత వరకు 24,988 డౌన్లోడ్ చేసినారు జిల్లా వ్యాప్తంగా మహిళపై దాడులు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటిపై నిఘా ఏర్పాటు చేసారు.
రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహన తనిఖీలు చేపట్టి, వాహన డ్రైవర్లుకు మత్తు వదిలించేందుకు వివిధ పీఎస్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది ఫేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, రహదారి భద్రతా నిబంధనల పట్ల అవగాహన కల్పించారు.