మల్చరీ పండ్లతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. మల్బరీ పండ్లలో విటమిన్ ఏ, బి, సి, డి ఉంటాయి. వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, జింక్, ప్రొటీన్, ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఏ నేత్ర కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. వారంలో 4 సార్లు ఈ పండును తీసుకుంటే కంటిచూపు పెరుగుతుంది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.